Breaking News

గంజాయి బ్యాచ్‌ వీరంగం

Published on Sun, 12/15/2024 - 09:07

ఉప్పల్‌: రామంతాపూర్‌లో గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌ చేసింది. ఏకంగా ఇంట్లోకి చొరబడి ఓ యువకుడిని చితక బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన  ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పొలీసులు, బాధితులు తెలిపిన మేరకు..రామంతాపూర్‌  లక్ష్మీ శ్రీకాంత్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న బాల నర్సింహ కుమారుడు భరత్‌ కుమార్‌(30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 

శుక్రవారం సాయంత్రం  తన ఆటోను ఇంటి ముందు పార్క్‌చేసి లోపలకు వెళ్లాడు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి ఆటోలో కూర్చుని గంజాయి తాగుతున్నారు.  ఇది గమనించిన భరత్‌ వారిని మందలించడంతో వారు మరికొందరిని పిలిపించారు. దీంతో భరత్‌ భయపడి ఇంట్లోకి వెళ్లాడు. రెచ్చి పోయిన అల్లరి మూక తలుపులు పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి భరత్‌ను విచక్షణా రహితంగా చితక బాదారు. 

ఈ దాడిని చూసిన స్థానికులు అక్కడకు వెళ్లడంతో వారు పరారయ్యారు. భరత్‌ను  చికిత్స నిమిత్తం ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయులో ఉంచినట్లు డాక్టర్లు తెలిపారు.  దీంతో కాలనీ వాసులంతా  ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

 

Videos

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)