Breaking News

శ్వేత మృతి కేసులో కీలక మలుపు.. 

Published on Fri, 04/28/2023 - 10:44

సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్వేత అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్వేత పేరెంట్స్‌ ఆరోపణల మేరకు, సూసైడ్‌ లెటర్‌ ఆధారంగా ఆమె.. భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాసేపట్లో వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక, పోలీసులు.. శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు.. శ్వేత కేసులో పోస్టుమారం రిపోర్టు కీలకంగా మారనుంది. 

ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. శ్వేతను ఆమె భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే, మణికంఠ సోదరి భర్త సత్యం లైంగిక వేధింపులకు గురి చేసినట్లు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లి రమ ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు సార్లు శ్వేతను ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మణికంఠ సోదరి భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అత్త, ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసు కట్టి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి, బంధువులకు అప్పగించగా.. కాన్వెంట్‌ కూడలి సమీపంలోని చావులమదుం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

మరోవైపు.. శ్వేత మృతదేహం లభ్యమైన ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికతో పాటు ఆమె సెల్‌ఫోన్‌ కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వీడియో: ర్యాపిడో బైకర్‌ వికృత క్రీడ.. మహిళకు చేదు అనుభవం
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)