Breaking News

బాలకృష్ణ కేసులో కీలక మలుపు.. తెరపైకి మరో ఐఏఎస్ అధికారి పేరు!

Published on Fri, 02/09/2024 - 15:21

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ కన్పెషన్ స్టేట్‌మెంట్‌ కీలకంగా మారింది. తన వాంగ్మూలంలో మరో ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్లు బాలకృష్ణ అంగీకరించారు. అక్రమాల చిట్టాను బయటపెట్టారు. ఐఏఎస్‌ అధికారి చెప్పిన ఫైళ్లు వెంటనే క్లియర్‌ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఐఏఎస్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం,కోర్టు అనుమతిని ఏసీబీ కోరనుంది.

ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 214 ఎకరాలు భూములను ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీ లోకి తీసుకుని ఏసీబీ విచారించగా, శివ బాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. సోదరుడు నవీన్ అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. 

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బాగోతం బయటపడుతోంది. మొన్న సోమేష్‌కుమార్‌, నిన్న అరవింద్‌ కుమార్‌, నేడు రజత్‌కుమార్‌ ఆస్తులపై వివాదం నెలకొంది. ఐఏఎస్‌ రజత్‌కుమార్‌..గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పని చేశారు. హేమాజీపూర్‌ సర్వే నంబర్‌ 83, 84, 85లో ఆయన కుటుంబం పేరు మీద భూములు ఉన్నట్లు సమాచారం. వరుసగా పలువురు ఐఏఎస్‌ల మీద ఆరోపణలు రావడంతో భూములను ఇతరుల పేర్లు మీద మార్చడానికి రజత్‌కుమార్‌ స్లాట్‌ బుక్‌ చేసినట్లు తెలిసింది. 15 ఎకరాల భూమిని ఇతరుల పేరు మీద మార్చేందుకు రజత్‌కుమార్‌ సిద్ధమయినట్లు సమాచారం.

ఇదీ చదవండి: శివ బాలకృష్ణపై ఈడీ.. ఐటీ?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)