Breaking News

దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్‌’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..

Published on Thu, 08/03/2023 - 12:50

సాక్షి, హైదరాబాద్‌: తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళకు బ్యూటీ పార్లర్‌ షాక్‌ ఇచ్చింది. పొడవాటి కురుల కోసం ప్రయత్నించి ఉన్న జుట్టును పొగొట్టుకుంది. అందం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లోని బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది.

జుట్టును అందంగా చేస్తానని చెప్పిన బ్యూటిషియన్‌.. ముందుగా మహిళ హెయిర్‌ కొంచెం కట్‌ చేసింది. బాధిత మహిళ అభ్యంతరం చెబుతున్నా విన్నకుండా ఏదో హెయిర్‌ ఆయిల్‌ కూడా పూసారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ మహిళ జుట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోయిన భార్యను చూసి భర్త షాక్‌ అయ్యాడు. అందగా కనిపించాలనుకున్న తన భార్యకు వెంట్రుకలు ఊడిపోవడంతో  ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఆలుమగల మధ్య చిచ్చు పెట్టిన బ్యూటీ పార్లర్‌పై బాధితురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊడిపోయిన జుట్టును పట్టుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి..

బ్యూటీ పార్లర్ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, హెయిర్ కలర్ కోసం అబిడ్స్‌లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్‌కి వచ్చాను. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని నా హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతామన్నారు. అది వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుంది. క్వీన్ పార్లర్‌ను వెంటనే సీజ్ చేయాలి’’ అని ఆమె పేర్కొంది.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)