Breaking News

Hyderabad: మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Published on Wed, 03/06/2024 - 08:18

గచ్చిబౌలి: మరి కొద్ది గంటల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ జరగాల్సి ఉంది. కాబోయే భర్త మాట్లాడి వెళ్లి కొద్ది సేపటికే ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాను ప్రసాద్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, గొసుకులపల్లికి చెందిన ముద్దం విద్యశ్రీ(23) కొత్తగూడలోని పీజీ హస్టల్‌లో ఉంటూ  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

సోమవారం సాయంత్రం  హస్టల్‌లోని బాత్‌ రూమ్‌కు వెళ్లిన ఆమె బయటికు రాకపోవడంతో రూమ్‌మేట్స్‌ తలుపులు తెరిచి చూడగా. టవల్‌తో షవర్‌ రాడ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వారు ఆమె సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కాగా ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కార్డులు పంపిణీ చేసి షాపింగ్‌ పూర్తి చేసింది. బుధవారం ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ జరగాల్సి ఉంది. ఆమెకు కాబోయే భర్త హస్టల్‌ వద్దకు మాట్లాడి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)