Breaking News

కొడుక్కి పాము కాటు.. చంపబోయిన తండ్రికి కూడా.. నాటు వైద్యాన్ని నమ్ముకుని ఇద్దరి మృతి!

Published on Sat, 07/22/2023 - 13:48

కామారెడ్డి జిల్లా: రాజంపేట మండలంలోని షేర్‌ శంకర్‌ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పాము కాటుకు గురై తండ్రి రవి (40), కుమారుడు వినోద్‌ (12) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 

కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు వినోద్‌ని మొదట పాము కరిచింది. ఇది గమనించిన తండ్రి రవి పామును చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రవిని సైతం పాము కాటు వేసింది.

అయితే ఆస్పత్రికి వెళ్లకుండా స్థానికంగా ఏదో ఆకు పసరు వేసుకుని.. తమకు ఏమీ కాదనే నమ్మకంతో ఉన్నారు. ఇంతలోనే వినోద్‌ ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. రవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి కూడా ప్రాణాలు కోల్పోయాడు. పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే ఇద్దరి ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు వాపోయారు. 

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)