Breaking News

పార్కింగ్ విషయంలో గొడవ.. తండ్రీకుమారులపై కాల్పులు

Published on Fri, 02/17/2023 - 14:27

న్యూఢిల్లీ: ఢిల్లీలోని యమున విహార్‌లో గురువారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. కారు పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తి తండ్రీకుమారులపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. 15 మంది గ్యాంగ్‌తో వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

బాధితులిద్దరినీ వీరేంద్ర అగర్వాల్, శుభం అగర్వాల్‌గా గుర్తించారు. వీరిద్దరూ గురువారం రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఓ కారు రోడ్డు మధ్యలో పార్క్ చేసి ఉంది. దీంతో కారును అక్కడి నుంచి వేరే చోట పెట్టుకోవాలని, రోడ్డు బ్లాక్ అయిందని వీరేంద్ర సూచించాడు. ఈ విషయంలో కారు యజమానితో వాగ్వాదం జరిగింది. 

అయితే కాసేపయ్యాక కారు యజమాని 15 మందితో కలిసి వీరేంద్ర ఇంటికి వెళ్లాడు. ఈ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి వీరేంద్రతో పాటు అతని కుమారుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరికి బుల్లెట్ గాయాలై తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన అనంతరం 15 మంది అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఒక్కడిని మాత్రం స్థానికులు పట్టుకుని చితకబాదారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. కారు యజమానిని గుర్తించామని, అతనితో పాటు మిగతా అందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రేమ నావలో ప్రయాణం.. సహజీవనం.. పెళ్లి ఊసెత్తితే చాలు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)