Breaking News

కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని..

Published on Tue, 12/10/2024 - 10:34

తాండూరు రూరల్‌: అలిగి వెళ్లిపోయిన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు కన్న కొడుకునే హత్య చేసేందుకు యత్నంచాడు ఓ తండ్రి. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మల్కోడ్‌ గ్రామానికి చెందిన హన్మంత్‌కు తాండూరు మండలం మల్కాపూర్‌కు చెందిన శరణమ్మతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు అరవింద్, ధర్మ, కార్తీక్‌ ఉన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మల్కాపూర్‌లో నివాసముంటున్నారు. నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్న హన్మంత్‌ రెండేళ్ల నుంచి శరణమ్మను వేధిస్తున్నాడు. 

దీంతో ఆమె రెండు నెలల క్రితం ఇద్దరు కొడుకులు ధర్మ, కార్తీక్‌లను తీసుకొని కర్ణాటక రాష్ట్రం బీదర్‌ సమీపంలోని బాల్కి గ్రామంలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. పెద్ద కుమారుడు అరవింద్‌ తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్‌లో ఉంటున్న శరణమ్మ సోదరుడు నాగప్ప ఆదివారం మృతి చెందాడు. విషయం తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరణమ్మ గ్రామానికి వచ్చింది. భార్య వచ్చిన విషయం తెలుసుకున్న హన్మంత్‌ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె మాట్లాడలేదు. అంత్యక్రియలు ముగిశాక శరణమ్మ మళ్లీ కర్ణాటక వెళ్లిపోయింది. 

ఎలాగైనా భార్యను ఇంటికి రప్పించాలని, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు అరవింద్‌ను హత్య చేస్తే భార్య వస్తుందని హన్మంత్‌ కుట్ర పన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లి కత్తితో కుమారుడి మెడ, చేతులపై దాడి చేశాడు. గాయాలు భరించలేక బాలుడు గట్టిగా అరవడంతో ఇంటి పక్కనే ఉన్న అశోక్‌తోపాటు మరికొందరు వచ్చి తలుపులు పగలగొట్టి అరవింద్‌ను కాపాడారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో ఎస్‌ఐ విఠల్‌రెడ్డి బాలుడిని తాండూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రస్తుతం అరవింద్‌ ఆరోగ్యం బాగున్నట్లు తెలిపారు. హన్మంత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)