Breaking News

కంచె.. ప్రాణాలు తీసింది 

Published on Wed, 02/22/2023 - 04:05

చిన్నగూడూరు: కోతులు, అడవి పందుల నుంచి పంటకు రక్షణగా పెట్టిన విద్యుత్‌ వైర్ల కంచె తండ్రీకొడుకుల ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం దుమ్లాతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఆంగోత్‌ సీవీనాయక్‌(60), అమ్మీ దంపతుల కుమారుడు కిరణ్‌(30) మొక్క జొన్న పంట వేశారు. పంట కంకి పోయడంతో కోతులు, అడవి పందులు వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి.

దీంతో చేను చుట్టూ విద్యుత్‌ వైర్‌ అమర్చారు. సాయంత్రం విద్యుత్‌ ఆన్‌చేసి, ఉదయాన్నే తీసివేసేవారు. కానీ మంగళవారం ఆఫ్‌ చేయడం మర్చిపోయారు. పంటకు నీరు కడుతుండగా కిరణ్‌ కాలుజారి విద్యుత్‌ సరఫరా అవుతున్న వైర్లకు తగిలి షాక్‌కు గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి నాయక్‌ కుమారుడిని కాపాడేందుకు పట్టుకున్నాడు.

గమనించిన తల్లి అమ్మీ కేకలకు పక్కనే ఉన్న రైతులు వచ్చి వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కానీ అప్పటికే ఇద్దరూ మరణించారు. కళ్లముందే భర్త, కొడుకు షాక్‌తో విలవిల్లాడుతూ మరణించడంతో గుండలవిసేలా రోదించింది. చిన్నగూడూరు ఎస్సై రవికుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)