Breaking News

అతివేగానికి ఐదు ప్రాణాలు బలి

Published on Mon, 08/12/2024 - 06:01

పళ్లిపట్టు:  చెన్నై– తిరుపతి జాతీయ రహదారిలోని తిరుత్తణికి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు ఏపీ విద్యార్థులు ఉండగా...తమిళనాడుకు చెందిన మరో విద్యార్థి ఉన్నాడు. కనకమ్మ సత్రం సీఐ రాజగోపాల్‌ తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని రామంజేరి వద్ద చెన్నై–తిరుపతి జాతీయ రహదారిపై రాత్రి 7 గంటల సమయంలో  చెన్నై వైపుగా అతివేగంగా దూసుకెళ్లిన వెర్టిగో కారు మరో వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న సరుకుల లారీని ఢీకొంది. 

ఈ ప్రమాదంలో కారు ముందు భా­గం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఏడుగురు యువకులు ఉండగా ఐదుగురు  ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు శిథిలాలలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ ఇద్దరిని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు తిరువళ్లూరు ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్‌  ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారులో లభించిన ఓ గుర్తింపు కార్డు ఆధారంగా మరణించిన వారు చెన్నై శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు తెలిసింది. 

ఆదివారం సెలవు కావడంతో తిరువణ్ణామలై, కాణిపాకం ఆలయాల దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. మృతి చెందిన వారిలో చేతన్‌ (21), యుగేష్‌ (21) తిరుపతికి చెందిన వారుగా భావిస్తున్నారు. మిగిలిన వారిలో నితీష్‌ (21), నితీ‹Ùవర్మ(21), రామ్‌గోపాలన్‌ (21)గా గుర్తించారు. వీరిలో రామగోపాలన్‌ తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన యువకుడు అని తేలింది. 

గాయపడ్డ ఇద్దరిని తిరుపతి జిల్లా గూడూరు న్యూ బాలాజీ నగర్‌కు చెందిన  శ్రీనివాసన్‌ కుమారుడు విష్ణువర్దన్‌ (21), ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన కొల్లూరి చైతన్య కుమార్‌ (21)గా గుర్తించారు. వీరు ప్రస్తుతం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం 
సాక్షి, అమరావతి: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని రామంజేరి వద్ద చెన్నై–తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఎంతో భవిష్యత్‌ ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వీరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవా లని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌