Breaking News

మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ అభిమాని మృతి

Published on Mon, 01/12/2026 - 17:29

సాక్షి,హైదరాబాద్‌: కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో జరిగిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రదర్శనలో దుర్ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ సినిమా చూస్తుండగా ఓ అభిమాని ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు.

థియేటర్‌లో ఉన్న ఇతర ప్రేక్షకులు వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు వెలువడేందుకు వైద్య పరీక్షలు, విచారణ కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్ అభిమానుల ఉత్సాహం మధ్య ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది.  

కాగా, మృతుడు 12వ బెటాలియన్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. ఉదయం 11.30 గంటల షో చూడటానికి సినిమా థియేటర్‌కు వచ్చారు. సినిమా మధ్యలో, అకస్మాత్తుగా తన సీటులో కుప్పకూలిపోయాడు. తోటి ప్రేక్షకులు భయపడ్డారు. తర్వాత తేరుకుని వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆనంద్ చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటు మరణానికి కారణమని అనుమానిస్తున్నారు
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)