Breaking News

ప్రియునిపై తుపాకీ కాల్పులు

Published on Sat, 11/30/2024 - 09:30

బనశంకరి: ప్రియడు మరో మహిళ మాయలో పడి తనకు దూరమయ్యాడనే కసితో ఓ యువతి తుపాకీతో కాల్పులు జరిపించింది. సినిమా రేంజ్‌లో జరిగిన సంఘటన బెళగావిలోనిది. ప్రేమికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

వివరాలు.. బెళగావి తిళకవాడి ద్వారకనగరవాసి ప్రణీత్‌కుమార్‌ (31), మెడికల్‌ రెప్‌గా పనిచేస్తాడు. బుధవారం రాత్రి మహంతేశనగర కేఎంఎఫ్‌ డైరీ వద్ద గల స్నేహితురాలు స్మిత ఇంటికి భోజనానికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా, మాజీ ప్రియురాలు అక్కడికి వచ్చింది. రాగానే ప్రణీత్‌తో గొడవకు దిగింది, స్మిత ఇద్దరికి సర్దిచెప్పడానికి ప్రయత్నించింది. కానీ మాజీ ప్రియురాలు వెంట వచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్రణీత్‌ను కొట్టి, తుపాకీతో కాల్పులకు దిగారు. మొదట బుల్లెట్లు ప్రణీత్‌ చెవిపక్క నుంచి దూసుకెళ్లడంతో ఏమీ కాలేదు. దీంతో దుండగులు మళ్లీ కాల్పులకు అతని తొడలోకి తూటా దూసుకెళ్లింది. మళ్లీ కాల్చడానికి యత్నించగా తుపాకీ జామ్‌ కావడంతో నలుగురూ వెళ్లిపోయారు.

పోలీసు కమిషనర్‌ ఆరా
రక్తపు మడుగులో పడిఉన్న ప్రణీత్‌ను స్మిత బిమ్స్‌ ఆసుపత్రికి తరలించి మాళమారుతి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ప్రణీత్‌ నుంచి సమాచారం సేకరించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ యడా మార్టీన్‌ ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. డీసీపీ రోహన్‌ జగదీశ్‌ ఘటనాస్థలిని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. త్వరగా దుండగులను పట్టుకుంటామని కమిషనర్‌ తెలిపారు. దుండగులు వాడిన గన్‌ గురించి దర్యాప్తు చేపడుతున్నామని, ప్రేమ గొడవలే కారణమని చెప్పారు. ప్రేమ గొడవ, తుపాకీ కాల్పుల వ్యవహారం నగరంలో కలకలం రేపింది. చిన్న చిన్న విషయాలకే తుపాకులను వాడడంపై నగరవాసులు సంభ్రమం వ్యక్తంచేశారు.

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)