Breaking News

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు!

Published on Fri, 05/16/2025 - 16:15

కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే కోపంతో ఆ అమ్మాయి భర్తను హత్యచేసిన ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో బాలానగర్‌ డీసీపీ సురేష్‌ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ రాజశేఖర్‌ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.    

 కాకినాడకు చెందిన పంపేన అయ్యప్పస్వామి అలియాస్‌ పవన్‌ (27) చిన్నప్పుడే తల్లి చనిపోవంతో మేనత్త ఇంటి వద్ద పెరిగాడు. ఈ సమయంలో శ్రావణి సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాని పెళ్లి చేసుకుంటానని వాళ్ల తల్లిదండ్రులకు బంధువులతో అడిగించాడు. అతడి ప్రవర్తన నచ్చక వివాహం చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ మండలం, ములగాడు గ్రామానికి చెందిన కాళ్ల వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారు బతుకు తెరువు కోసం భగత్‌సింగ్‌ నగర్‌ఫేస్‌–1లో నివాసముంటున్నారు. 

ఇటీవల తన సోదరీతో కలిసి శ్రావణి సంధ్య రాజమండ్రికి వివాహ కార్యక్రమానికి వెళ్లగా అక్కడ పవన్‌ ఆ అమ్మాయిని చూశాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలంటే ఆమె భర్తను చంపాలని పవన్‌ పథకం వేసి ఆ అమ్మాయి నివాసముండే సమీపంలో మకాం మార్చాడు. తరచూ ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో ఈ నెల10న అర్ధరాత్రి వెంకటరమణ తన తోడల్లుడు దుర్గాప్రసాద్‌తో ఇంట్లో బంధువులతో కలిసి ఉండగా పవన్‌ వచ్చి గొడవ పడ్డాడు. వెంకటరమణను హత్య చేసేందుకు పవన్‌ తన స్నేహితులైన గుప్పల శివరామకృష్ణ (20), రాజమహేంద్రవరం అనిల్‌ (19), నంబిగారి సాయికుమార్‌(20), మరో బాలుడిని కలిసి వచ్చి వెంకటరమణ గుండెల్లో కత్తితో పొడవగా అక్కడికక్కడే వెంకట రమణ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుబ్బల శివరామకృష్ణ, రాజమహేంద్రవరం అనిల్, నంబిగారి సాయికుమార్‌ను అరెస్టు చేయగా బాలుడిని జువైనల్‌ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు అయ్యప్పస్వామి అలియాస్‌ పవన్‌న్‌ పరారీలో ఉండగా గురువారం రిమాండ్‌కు తరలించామన్నారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)