Breaking News

హైదరాబాద్‌లో దారుణం.. మాజీ ప్రియురాలి ఇంట్లోకి దూరి..

Published on Fri, 04/14/2023 - 11:04

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమికులుగా విడిపోయిన తర్వాత తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ ఓ యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. పబ్‌లలో గిటారిస్ట్‌గా పని చేస్తున్న లలిత్‌ సెహెగల్‌కు 2016లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న యువతి (36)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.

ఇద్దరూ 2021 వరకు స్నేహితులుగా ఉన్నారు. అదే ఏడాది ఇద్దరి మధ్య బ్రేకప్‌ జరిగి.. ఎవరికి వారే వేర్వేరుగా ఉంటున్నారు. కొంత కాలంగా సదరు యువతి లలిత్‌ సెహగల్‌ స్నేహితుడితో సన్నిహితంగా మెలుగుతోందని, ఈ విషయంపై నిలదీసేందుకు గచ్చిబౌలిలోని హాస్టల్‌లో ఉంటున్న లలిత్‌ సెహెగల్‌.. యువతి ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చాడు.
చదవండి: పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్‌..

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో గొడవపడ్డారు. ఈ సమయంలోనే తన దుస్తులను చించేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడు లలిత్‌ సెహగల్‌పై ఐపీసీ సెక్షన్‌ 376 రెడ్‌విత్‌ 511, 323, 354, 509ల కింద కేసు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)