Breaking News

అమానవీయ ఘటన.. కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసిన మహిళ

Published on Fri, 07/14/2023 - 13:31

సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి హేయమైన చర్య ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసింది తల్లి పుట్ట విజయ లక్ష్మి.

సదరు మహిళకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, భర్త మరణించగా మేనత్త కొడుకు సతీష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానంటూ సతీష్‌ బెదిరించడంతో వేరే పెళ్లి వద్దని, తన ఇద్దరు కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని రెండో భర్తకు అప్పగించింది.

17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి మృతి చెందాడు. భార్య భర్తల మధ్య విభేదాలతో వ్యవహారం  బయటపడింది. విషయం తెలిసిన బంధువులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు సతీష్, విజయలక్ష్మిలను అదుపులోకి తీసుకుని పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: హైదరాబాద్‌: టీవీ సీరియల్‌ నటి అదృశ్యం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)