Breaking News

‘సార్‌..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి.. జైలుకు పంపండి..’

Published on Mon, 10/14/2024 - 11:47

ఫిలింనగర్‌: మద్యం మత్తులో ఓ మహిళ (44) పార్కు పక్కన తూలిపోతూ..రోడ్డు పక్కన పడుకుని న్యూసెన్స్‌ చేస్తుండగా సమాచారం అందుకున్న ఫిలింనగర్‌ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని సయ్యద్‌నగర్‌ బస్తీలో నివసించే ఓ మహిళ గత కొంతకాలంగా మద్యానికి బానిసై అర్ధరాత్రి దాకా రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తుంది. 

శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని ఎన్‌బీటీనగర్‌ ప్రాంతంలో మద్యం మత్తులో న్యూసెన్స్‌ చేస్తుండగా బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి ఆమె ఇంట్లో అప్పగించి వచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండానే ఆమె మళ్లీ అదే అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో బయటకు వచి్చంది. ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని లోటస్‌పాండ్‌ పార్కు వద్ద వివస్త్రగా పడి ఉంది. 

శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిలింనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె గురించి ఆరా తీయగా సయ్యద్‌నగర్‌లో నివసిస్తుందని తెలిసింది. దీంతో ఆమె కూతురికి ఫోన్‌ చేయగా ‘సార్‌..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి..జైలుకు పంపండి..’ అంటూ ఆమె ఇంట్లో చేసిన న్యూసెన్స్‌ను మొరపె ట్టుకుంది. 

ఆమె భర్త పెయింటర్‌గా పనిచేస్తుంటాడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, మద్యానికి బానిసై నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత నెల రోజుల నుంచి 10 మార్లు పోలీసులు ఆమెను ఇలా గే రోడ్లపై మద్యం మత్తులో తిరుగుతుండగా కు టుం బసభ్యులకు అప్పగించారు. ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు