Breaking News

దారుణం: డీజే సౌండ్‌ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..

Published on Tue, 04/04/2023 - 13:38

డీజే సౌండ్‌ని తగ్గించమన్నందకు కోపంతో గర్భిణి అని చూడకుండా కాల్పుల జరిపారు. దీంతో ఆమెకు గర్భస్రావం అయ్యింది. ఈ ఘటన ఢిల్లీలోని సిరాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ‍ప్రకారం..హరీష్‌ అనే వ్యక్తి కొడుకుకి కువాన్‌ పూజ అనే వేడుక ఉంది. ఆ ఫంక్షన్‌ కోసం అని డీజే పెట్టారు  చాలా బిగ్గరగా పెట్టడంతో ఆ వీధిలోనే ఉండే రంజు అనే 30 ఏళ్ల మహిళ సౌండ్‌ తగ్గించమని హరీష్‌ని కోరింది.

అంతే హరీష్‌ తన స్నేహితుడు అమిత్‌ నుంచి తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో తుపాకీ నేరుగా మెడ మీదకు దూసుకపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో ఆమె బంధువులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

మెడపై తుపాకీ గుండు తగలడంతో బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోవడం కుదరదని వైద్యులు చెప్పారు. దీంతో ఈ ఘటన జరిగినప్పుడూ ఉన్న ‍పత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించి పోలీసలు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా బాధితురాలికి గర్భస్రావం అయినట్లు వెల్లడించారు. కాగా, నిందితులు హరీష్‌ డెలివరీ బాయ్‌గానూ, అమిత్‌ మొబైల్‌ రిపేరు షాపు పని చేస్తాడని పోలీసులు తెలిపారు.  

(చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)