Breaking News

ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి..

Published on Wed, 01/04/2023 - 14:54

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి బలవంతంగా కారులోకి లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అయినా యువతి భయపడకుండా కారు ఎక్కేందుకు నిరాకరించింది.

దీంతో అతడు ఆమెను కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీలో వరుసగా దారుణాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. జనవరి 1న అంజలి అనే యువతి స్కూటీని ఢీకొట్టి ఆమెను కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

జనవరి 2న ఆదర్శ్ నగర్‌లో జరిగిన మరో దారుణ ఘటనలో శివకుమార్ అనే 20 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల యవతిని కత్తితో పలుమార్లు పొడిచాడు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటీకీ ఏదో విషయంలో గొడవపడి అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
చదవండి: అయ్యో అంజలి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్‌ విషయాలు

Videos

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

టికెట్లు నిల్! 70 ఏళ్ల కుర్రోడి స్టామినా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు!

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్