Breaking News

హనీట్రాప్‌ కలకలం.. కపిల్‌పై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు

Published on Tue, 08/08/2023 - 19:52

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్‌ కేసులో చిక్కుకున్న సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ కపిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్‌ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన హనీట్రాప్‌ కేసులో కపిల్‌పై కేసు నమోదు చేశాం. కపిల్‌ వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్‌ ఫోరెన్సిక్‌కు పంపించాము. కానిస్టేబుల్‌ కపిల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన కపిల్‌ కుమార్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సెక్యూరిటీలో కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. 

ప్రస్తుతం అతడు సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ విభాగంలో పనిచేస్తునే పేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్‌పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్‌.. సీఎం జగన్‌ సాయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)