Breaking News

ట్యూషన్‌ టీచర్‌కు 111 ఏళ్ల జైలు.. ఏం నేరం చేశాడంటే..?

Published on Wed, 01/01/2025 - 02:17

తిరువనంతపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్‌ టీచర్‌కు కేరళలోని స్పెషల్‌ ఫాస్ట్‌–ట్రాక్‌ కోర్టు ఏకంగా 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇటువంటి నేరానికి పాల్పడినందున జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్‌(44) తను ఉండే ఇంట్లోనే ట్యూషన్లు చెబుతుండేవాడు. అతడి వద్దకు వచ్చే 11వ తరగతి బాలికను 2019లో ఓ రోజు ప్రత్యేక క్లాసుకని పిలిపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా సెల్‌ఫోన్‌లో షూట్‌ చేశాడు.

ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ట్యూషన్‌కు వెళ్లడం మానేసింది. మనోజ్‌ తన ఘనకార్యాన్ని చెప్పుకునేందుకు ఆ ఫొటోలను మరికొందరికి పంపాడు. విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు ఫోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన మనోజ్‌ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మనోజ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి సెల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. బాలికపై అత్యాచారం జరిపిన ఫొటోలు అందులో ఉన్నట్లు గుర్తించారు.

అయితే, అదే సమయంలో ఆఫీసులో ఉన్నట్లు అక్కడి రిజిస్టర్‌లోని సంతకం చూపి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, మనోజ్‌ ఫోన్‌లోని కాల్‌ రికార్డుల ఆధారంగా అవన్నీ తప్పని తేలింది. దీంతో, ప్రత్యేక కోర్టు నిందితుడికి 111 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ఆర్‌.రేఖ తీర్పు వెలువరించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)