Breaking News

ప్రేమించి పెళ్లి.. కానిస్టేబుల్‌ భర్త వేధింపులు భరించలేక

Published on Wed, 03/22/2023 - 08:54

సాక్షి, మలక్‌పేట: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (కానిస్టేబుల్‌) పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.  ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ కుమార్తె  పవిత్ర(27), తిరుమలగిరిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అవినాష్‌  2016 జూన్‌ 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మలక్‌పేటలోని బి–బ్లాక్‌ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. వారికి ఓ కూతురు అవిక్షిత (5) ఉంది.

అయితే కూతురు పుట్టినప్పటినుంచీ  అవినాష్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది.  తాగుడుకు బానిసై అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. మద్యం మత్తులో పవిత్రను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై మహిళా పోలీసుల వద్ద అతనికి కౌన్సిలింగ్‌ కూడా ఇప్పించారు.  అయినా అతని ప్రవర్తన మారలేదు. ప్రవర్తన మార్చుకుంటానని,  మద్యం మానేస్తానని  మామ శ్రీనివాస్‌కు చెప్పగా.. కారు కొనుకోవడానికి రూ.2 లక్షలు ఇచ్చాడు.

ఇదిలా ఉండగా.. సోమవారం ఉదయం అవినాష్‌ డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. సాయంత్రం 4.30 గంటలకు అత్త రేణుకకు ఫోన్‌చేసి అరగంట నుంచి తనతో పవిత్ర గొడవ పడుతోందని చెప్పాడు. సాయంత్రం మామకు ఫోన్‌ చేసి పవిత్ర చీరతో ఉరేసుకుని చనిపోయిందని చెప్పాడు. అల్లుడు అవినాష్‌ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతోనే తన కూతురు చనిపోయిందని మృతురాలు తండ్రి శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసి పోలీసులు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)