Breaking News

‘రేవ్‌’ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!

Published on Thu, 05/23/2024 - 03:30

చిత్తూరు అర్బన్‌: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్‌ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫొటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్‌ విక్రమ్‌నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్‌కుమార్‌నాయుడు ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు, వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

రణధీర్‌విక్రమ్‌నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్‌కుమార్‌నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీలో జరిగిన రేవ్‌ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు. 

మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్‌ అబూబక్కర్‌ సిద్ధికి, ఎల్‌.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్‌ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్‌ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

అంతా ఓ పద్ధతి ప్రకారం..  
వాసు బర్త్‌ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్‌ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్‌ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్‌ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్‌వర్డ్‌ ఇచ్చారు. వాసు బర్త్‌ డే పార్టీ అనే యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. 

‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్‌ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్‌ సిటీ స్టేషన్‌ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్‌ రాకెట్‌ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు. 

ఈ ఘటనలో పోలీసులు సీజ్‌ చేసిన కార్లలో ఫార్చూనర్‌ కారు ఏపీ 39 హెచ్‌ 0002 నంబర్‌తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)