Breaking News

కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

Published on Thu, 07/04/2024 - 04:47

కరీంనగర్‌క్రైం: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది.  కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అధికారులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని జెడ్పీ సీఈవో ఎం.శ్రీనివాస్‌ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కొత్తగా అమలులోకి వచి్చన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) 221, 126(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.  

జెడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే ఫిర్యాదు 
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సమస్యలపై తాను జెడ్పీ సమావేశంలో ప్రశ్నించేందుకు ప్రయత్నించగా జెడ్పీ సీఈవో తన విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి బుధవారం కరీంనగర్‌ సీపీకి ఫిర్యాదు చేశారు. 

నియోజకవర్గంలో దళితుల కోసం దళితబంధు, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం ప్రజాప్రతినిధిగా ప్రశి్నస్తున్న సమయంలో తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా జెడ్పీ సీఈవో ప్రొటోకాల్‌ ఉల్లంఘించారని కౌశిక్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే విచారణ చేసి సీఈవోపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)