Breaking News

శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Published on Sat, 10/14/2023 - 10:02

సాక్షి, హైదరాబాద్‌:  మేడ్చల్ జిల్లా  శామీర్ పేటలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓఆర్ఆర్‌పై వేగంగా వచ్చిన ఇనోవా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని వెనుకను నుంచి ఢీ కొట్టింది. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇనోవా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను కుత్బుల్లాపూర్‌కు చెందిన డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు శామీర్ పేట పోలీసులు పేర్కొన్నారు.

బిజినెస్‌లో భాగస్వామ్యులు అయిన నలుగురు కలిసి తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని ఇన్నోవా కారులో తిరి ప్రయాణమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనేలోపే ఈ ప్రమాదం సంభవించింది. వీళ్లు ప్రయాణిస్తున్న కారు షామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌పై అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని వెనక నుంచి గుద్దుకుంది. దైవ దర్శనానికి వెళ్లి ఇద్దరు మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)