Breaking News

ఓ లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి మరో లారీని ఢీకొన్న కారు

Published on Thu, 04/25/2024 - 16:07

కావలి: ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్‌లో ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలో చోటుచేసుకుంది. కావలి రూరల్‌ సీఐ కె.శ్రీనివాసరావు కథనం మేరకు.. ఏలూరు వైఎస్సార్‌ నగర్‌కు చెందిన కుమార్‌ (45), జ్యోతి (38), సిరి అలియాస్‌ రాజీ (38) వన్‌గ్రామ్‌ గోల్డ్, ఇమిటేషన్‌ జ్యూవెలరీ వ్యాపారం చేస్తుంటారు.

వస్తువుల కోసం చెన్నైకి కారులో వెళ్లారు. తిరిగి ఏలూరుకు బయలుదేరిన క్రమంలో బుధవారం తెల్లవారుజాము­న ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్‌లో ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కుమార్, జ్యోతి, సిరి అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్‌ జిలానీ, కుమారి అనే మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌లో వారిని చికి­త్స కోసం నెల్లూరుకు తరలించారు. కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)