Breaking News

వివాహేతర సంబంధం: క్యాబ్‌ డ్రైవర్‌ దారుణ హత్య

Published on Sun, 01/05/2025 - 11:18

మేడిపల్లి:  మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.  పోలీసులు, స్థానికులు తెలిపిన  మేరకు.. పీర్జాదిగూడలోని మల్లికార్జున నగర్‌లో పద్మ(40) అనే మహిళ అనురాగ్‌ రెడ్డి బాయిస్‌ హాస్టల్‌ నిర్వహిస్తోంది.  ఈ హాస్టల్‌లో జనగామ జిల్లా బండ్లగూడెం గ్రామానికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ మహేందర్‌ రెడ్డి (38)  ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండటంతో మహేందర్‌ రెడ్డి హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడు. అయితే అప్పుడప్పుడు హాస్టల్‌కు వచ్చేవాడు. 

ఈ క్రమంలో శుక్రవారం హాస్టల్‌కు రావాలని పద్మ పిలువగా శనివారం రాత్రి వెళ్లాడు.  ఆ సమయంలో హాస్టల్‌ గదిలో సూర్యాపేటకు చెందిన కిరణ్‌ రెడ్డి(35),పద్మ కలిసి ఉన్నారు. దీంతో ముగ్గురికీ మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ గొడవలో కిరణ్‌ రెడ్డి, పద్మలు  వంటకు ఉపయోగించే  గంటె, కూరగాయలు కోసే కత్తితో మహేందర్‌ రెడ్డి పై దాడికి పాల్పడ్డారు.  తీవ్రంగా గాయపడ్డ మహేందర్‌ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.  పోలీసులు సంఘటనా స్థలానికి స్థలానికి చేరుకుని  మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను  అదుపులోకి తీసుకున్నట్లు  సమాచారం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)