Breaking News

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

Published on Tue, 07/11/2023 - 07:07

సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శి సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఎస్పీ కాలువలోకి ఆర్టీసీ ఇంద్ర బస్సు దూసుకుపోవడంతో ఏడుగురు మృతిచెందారు.  ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్‌ అజీస్‌(65), జానీబేగం(65), అబ్దుల్‌ హనీ(60), నూర్జహాన్‌(58), షేక్‌ రమీజ్‌(48), షబీనా(35), షేక్‌ హీనా(6) మృతిచెందారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ రిసెప్షన్‌ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. బస్సు తలకిందులుగా పడటంతో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక 7 మంది మృతి చెందారు. దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

బస్సు ప్రమాద ఘటనాస్థలిని ఎస్పీ మలిక గర్గ్‌ పరిశీలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)