Breaking News

హిట్‌ అండ్‌ రన్‌.. బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

Published on Sat, 12/21/2024 - 08:34

పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదయ్యింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్‌ విద్యార్థి  వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన పున్నం లోకేష్‌ (21) బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు. 

పంజగుట్ట– అమీర్‌పేట మార్గంలోని బిగ్‌బజార్‌ ఎదురుగా గుర్తు తెలియని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వేగంతో వచ్చి వెనక నుంచి లోకేష్‌ బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న లోకేష్‌ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాద స్థలికి   వచి్చన పోలీసులు లోకేష్‌ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదు మేర కు పోలీసులు హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

యథేచ్ఛగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు..  
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల ప్రమాదాలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యమయాయి. ట్రావెల్స్‌ బస్సులు ఉదయం 7.30 గంటల్లోపే నగరంలోని రోడ్లల్లో తిరగాలనే నిబంధనలు ఉండడంతో సమయంలోపు నగర శివారు దాటాలన్న ఉద్దేశంతో అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని వారు పేర్కొంటున్నారు.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)