Breaking News

బైక్‌ అదుపు తప్పి బీటెక్‌ విద్యార్థి దుర్మరణం

Published on Thu, 04/13/2023 - 12:26

విశాఖపట్నం: మండలంలోని సబ్బవరం–చోడవరం రోడ్డులోని ఆరిపాక శివారు లగిశెట్టిపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో బీటెక్‌ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీస్‌లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. రోలుగుంట మండలంలోని అడ్డసార శివారు మర్రిపాలెం గ్రామానికి చెందిన కూరాకుల చిన్నబ్బాయి చిన్న కుమారుడు నాని(21)తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన అతడు బుధవారం రాత్రి బైక్‌పై తగరపువలసలోని కళాశాలకు తిరిగి వెళ్తున్నాడు.

ఆరిపాక శివారు లగిశెట్టిపాలెం వద్ద బైక్‌ అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు హెల్మెట్‌ ఉన్నప్పటికీ బలంగా ఢీకోవడంతో హెల్మెట్‌ నుజ్జునుజ్జు అయి తలకు తీవ్రగాయాలయ్యాయి .దీనితో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్‌ఐ  వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)