Breaking News

అతీక్ అహ్మద్‌ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు?

Published on Mon, 04/24/2023 - 17:07

లక్నో: ఇటీవల దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు కన్పించడం చర్చనీయాంశమైంది. ఈ ఆఫీస్‌ను అధికారులు పాక్షికంగా కూల్చారు. అయితే కార్యాలయం లోపల రక్తపు మరకలు, ఓ తెల్లటి వస్త్రం కన్పించడం చూసి షాకయ్యారు. అక్కడే ఓ కత్తి కూడా లభించింది.

దీంతో ఈ రక్తపు మరకలు ఎవరివై ఉంటాయని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ టీంను రప్పించారు. వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు.  అతీక్‌ అహ్మద్‌కు చెందిన ఈ ఆఫీస్ ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్‌ పోలీస్‌ స్టేషన్ పరిధి కర్బాల ప్రాంతంలో ఉంది. ఈ కార్యాలయం ఆవరణలోనే 10 అక్రమ ఆయుధాలతో పాటు రూ.74.62 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లోని ఓ హోటల్‌లో..  డిప్యూటీ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్ డా.సుశీల్ కుమార్ సింగ్ మృతదేహాన్నిగుర్తించడం కలకలం రేపింది.  పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేసుకున్నాడా అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.

కాగా.. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ముందే ముగ్గరు యువకులు వీరిని పాయింట్‌ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చదవండి: యూపీలో దారుణం.. హోటల్‌ గదిలో విగతజీవిగా వైద్యాధికారి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌