Breaking News

దృశ్యం సినిమాను తలపించిన స్వాతి కేసు

Published on Wed, 11/13/2024 - 13:23

భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: జిల్లాలో ఓ మహిళ మిస్సింగ్‌ కేసు కాస్త విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన స్వాతి అనే మహిళ.. ముక్కలై గోనె సంచిలో తేలింది. దృశ్యం సినిమాను తలపించిన ఈ కేసులో ప్రియుడే ఆమెను దారుణంగా హతమార్చగా.. డబ్బే అందుకు ప్రధానకారణమని తేలింది.

జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రం.. స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వీరభద్రం భార్యతో స్వాతికి గొడవ జరిగింది. ఇందుకు సంబంధించి చుంచుపల్లి పీఎస్‌లో స్వాతిపై కేసు నమోదైంది. అయితే ఈ విచారణలో భాగంగా స్వాతి కోసం పోలీసులు ఆరా తీయగా.. ఆమె కనిపించడం లేదనే విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో వీరభద్రంను విచారించిన జూలూరుపాడు పోలీసులు.. అతని నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో విచారించగా.. స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం నేరం ఒప్పుకున్నాడు. ఈపై ఆమెను చంపి పాతిపెట్టిన గోనె సంచిని తవ్వి తీసి పోలీసులకు అప్పగించాడు. 

మొత్తం డబ్బు తనకే ఉండాలని.. 
గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు.. సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని స్వాతి నమ్మబలికింది. వాళ్ల దగ్గరి నుంచి రూ.16 లక్షల దాకా వసూలు చేసి వీరభద్రం చేతికి అప్పగించింది. అయితే ఎంతకీ వాళ్ల నుంచి బదులు లేకపోవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించారు ఆ భార్యభర్తలు. అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. ఆ డబ్బు మొత్తం తానే అనుభవించాలనే ఉద్దేశంతో స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు