Breaking News

ఎయిర్‌పోర్ట్‌లో అడుక్కుంటున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే!

Published on Tue, 05/16/2023 - 13:49

బెంగళూరు: సాధారణంగా మనం రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో భిక్షాటన చేసేవాళ్లను చూస్తుంటాం. కానీ ఓ యువకుడు ఏకంగా ఎయిర్ పోర్టులోని ప్రయాణికుల వద్ద భిక్షాటన చేస్తు కనిపించాడు. ఇది గమనించిన విమానాశ్రయ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విఘ్నేశ్ అనే 27 ఏళ్ల యువకుడు ఎయిర్ పోర్టులో ప్రవేశించేందుకు చెన్నై వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. విమానాశ్రయంలోకి వెళ్లి అక్కడ ఉన్న ప్రయాణికుల వద్ద.. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తక్షణ వైద్యం అందించాలని తప్పుడు కథనాన్ని సృష్టించాడు.

ఈ విధంగా చెబుతూ ప్యాసింజర్ల నుంచి రూ. 7వేలు, పదివేలు కావాలంటూ అభ్యర్థించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తన చూసిన కొందరు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని నుంచి 26 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకోగా.. అందులో 24 క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 ఇదంతా ఓ ముఠా పని అయ్యిండచ్చని.. విఘ్నేశ్ కూడా ఆ గ్యాంగ్‌లో ఒక్కడే అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో ఈ తరహా కార్యకలాపాలు జరగడం చాలా అరుదు. రెండేళ్ల క్రితం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనే జరగగా.. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఇటువంటి ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)