Breaking News

కేజిన్నర బంగారం దోపిడీ

Published on Thu, 04/06/2023 - 05:37

గుడిపాల (చిత్తూరు జిల్లా): జనం చూస్తుండగానే ఓ మహిళపై దాడిచేసి.. బ్యాగ్‌లో ఉన్న కేజిన్నర బంగారాన్ని దుండగులు దోచుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వసంతాపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వసంతాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఉష దంపతులు గుడిపాలలో జ్యూవెలరీ దుకాణం నడుపుతున్నారు. వీరు ప్రతిరోజూ ఇంటి నుంచి బంగారాన్ని తీసుకుని దుకాణానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మిగిలిన ఆభరణాలను రాత్రివేళ ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్త చేస్తుంటారు.

బుధవారం రాత్రి 7:30 గంటలకు దుకాణం నుంచి కారులో బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటివద్ద వెనుక వైపున భర్త కారు పార్కింగ్‌ చేస్తుండగా.. ఉష బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ పట్టుకుని నిలబడింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఉషపై దాడి చేశారు. ఆమె చేతిలో ఉన్న బంగారం బ్యాగ్‌ను గుంజుకుని పారిపోయారు. దీనిని గమనించిన భర్త, స్థానికులు ఆమె వద్దకు చేరుకోగా.. అప్పటికే దుండగులు పరారయ్యారు.

నిందితులు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో గల ద్విచక్ర వాహనంపై వచ్చారని స్ధానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, తమిళనాడు సరిహద్దులో వాహన తనిఖీ చేపట్టామని చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)