Breaking News

తిరుపతి: ఇష్టంలేని పెళ్లి చేశారని టెక్కీ ఘాతుకం

Published on Wed, 07/24/2024 - 22:08

తిరుపతి క్రైం: తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. బుధవారం రాత్రి తిరుపతి పద్మావతినగర్‌లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. 

పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరిపిదాస్‌ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్‌ ఉద్యోగి అయిన దాస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. దాస్‌ సోదరుడు గుడిమెట్ల మోహన్‌ (36) చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అతడికి 2019లో అన్నావదినలు వివాహం జరిపించారు. వివాదాల నేపథ్యంలో 2021లో భర్త మోహన్‌ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. 

ఆ తరువాత తమ్ముడి భార్య, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన దాస్‌ ఇద్దరూ కాపురం చేసుకునేలా ఒప్పించాడు. ఆ సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేశావంటూ దాస్‌పై తమ్ముడు మోహన్‌ దాడి చేశాడు. కొంతకాలం అనంతరం మోహన్‌ అతడి భార్య మధ్య గొడవలు ప్రారంభం కావటంతో మోహన్‌ భార్య తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్న మోహన్‌ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. రెండు రోజుల క్రితం తిరుపతి వచి్చన మోహన్‌ బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలను స్కూల్‌ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద విడిచిపెట్టి బజార్‌కు వెళ్లాడు. 

అన్న ఇంట్లో లేని సమయంలో తిరిగి వచ్చిన మోహన్‌ కత్తితో వదిన, అన్న కుమార్తెల గొంతుకోశాడు. ఆ తరువాత తాను గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాస్‌ ఇంటికి చేరుకోగా.. తలుపులు లోపలికి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి వెనుక డోర్‌ తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. 

తమ్ముడు గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ రవిమనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన తమ్ముడు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు తనపై కక్ష పెంచుకున్నాడని దాస్‌ చెప్పాడు. భార్యాభర్త విడిపోవడంతో ఇద్దర్నీ కలిపేందుకు ప్రయత్నించానని తెలిపాడు. తనపై కోపం పెంచుకుని చివరకు  ఇలా చేశాడని వాపోయాడు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)