Breaking News

నాన్న.. అనిపించుకోకుండానే..

Published on Tue, 11/19/2024 - 11:35

తండ్రిని కాబోతున్నాననే ఆనందంతో ఆర్మీ జవాన్‌ సెలవుపై వచ్చాడు. సోమవారం భార్య ప్రసవానికి వైద్యులు సమయం ఇచ్చారు. కానీ ఒక్క రోజు ముందే ఆదివారం రాత్రి మృత్యువు వెంటాడింది. నాన్న అనిపించుకోకుండానే ఆ ఆర్మీ జవాన్‌ను రోడ్డు ప్రమాదం కబళించింది. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో అతడితోపాటు మరొకరు చనిపోయారు. 

నస్పూర్‌: తెల్లవారితే తనకు పుట్టబోయే బిడ్డను ఎత్తుకుని మురిసిపోదామనుకున్న ఒకరు నాన్న అనే పిలుపునకు నోచుకోకుండానే, తన సోదరుని అత్త మరణ వార్త తెలుసుకుని అతన్ని ఓదార్చుదామనుకున్న మరోవ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలోని దొరగారిపల్లెలో చోటు చేసుకుంది. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దొరగారి పల్లెకు చెందిన ముల్క ఉదయ్‌ ఆదివారం రాత్రి  పని నిమిత్తం బైక్‌పై మంచిర్యాలకు వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన పత్తి నర్సింహ తన భార్య రమాదేవితో కలిసి ద్విచక్ర వాహనంపై గద్దెరాగడికి బయలుదేరాడు. దొరగారిపల్లె గ్రామ సమీపంలో 200 పీట్ల సర్వీస్‌ రోడ్డు వద్దకు రాగానే ఇరువురి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఉదయ్, నర్సింహ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

భార్య డెలివరీకి వచ్చి...
ముల్క ఉదయ్‌ భోపాల్‌ రాష్ట్రంలో ఆర్మీ జవానుగా ఉద్యోగం చేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన పావనితో 2022లో వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఆమె డెలివరీ కోసం పదిరోజుల క్రితం ఇంటికి వచ్చాడు. వైద్యులు ఆమెకు సోమవారం డెలివరీ సమయం ఇచ్చినట్లు సమాచారం. తెల్లవారితే తనకు ముద్దులొలికే చిన్నారి జన్మిస్తుందని అతను కన్న కలలు నెరవేరకుండానే ఇలా మృత్యువు కబలించడం కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. 

సోదరుని పరామర్శించేందుకు వెళ్తూ...
నస్పూర్‌కాలనీలో చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న పత్తి నర్సింహకు 2014లో రమాదేవితో వివాహమైంది. గద్దెరాగడిలో నివాసం ఉండే తన సోదరుని అత్త మృతి చెందిన విషయం తెలుసుకున్న నర్సింహా ఆదివారం రాత్రి రమాదేవిని బైక్‌పై ఎక్కించుకుని గద్దెరాగడికి బయలుదేరాడు. నర్సింహను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడం, అతని భార్య గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

గ్రామంలో విషాదం..
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో దొరగారి పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)