Breaking News

అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ

Published on Sat, 06/17/2023 - 09:21

అప్సర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.  అప్సర హత్య కేసులో పోలీసులు శుక్రవారం సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. కోర్టు అనుమతితో నిందితుడు అయ్యగారి వెంకట సూర్య సాయి కృష్ణను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న శంషాబాద్‌ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి శివార్లలోని బ్యూటీగ్రీన్‌ పక్కన ఉన్న గోశాలకు సాయి కృష్ణ తరచూ వచ్చేవాడు. హత్య జరిగిన రోజు అతను అప్సరతో కలిసి అక్కడికి వచ్చాడు. గోశాలలో రక్తం చిందిస్తే పాపం చుట్టుకుంటుందని భావించిన సాయి కృష్ణ అక్కడి నుంచి కారులో తిరిగి శంషాబాద్‌ వైపు బయలుదేరాడు.

గోశాల నుంచి దాదాను రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత నర్కూడ సమీపంలో శంషాబాద్‌–షాబాద్‌ రోడ్డు పక్కన ఉన్న వెంచర్‌లో అప్సర తలపై రాయితో మోది హత్య చేశారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా పోలీసులు నిందితుడు సాయికృష్ణను గోశాల, వెంచర్‌ వద్దకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించారు. వెంచర్‌ సమీపంలో చిన్న బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాళ్లగూడ, శంషాబాద్‌ బస్టాండ్‌ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన సీసీ టీవీ ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు.

సరూర్‌నగర్‌ మండల కార్యాలయం వెనకాల అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి కూడా నిందితుడిని తీసుకెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇన్‌స్పెక్టర్‌ ఏ.శ్రీధర్‌కుమార్‌ నేతృత్వంలో ఈ రీ కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. ఇదిలా ఉండగా పోలీసు కస్టడీ ముగియడంతో నిందితుడు సాయి కృష్ణను శనివారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)