Breaking News

యువతిని రూమ్‌కు తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఫొటోలు.. ఆపై..

Published on Fri, 08/04/2023 - 08:22

హైదరాబాద్‌(వెంగళరావునగర్‌): పబ్జి గేమ్‌ ద్వారా స్నేహాన్ని పెంచుకున్న యువకుడు ఓ మహిళను శారీరకంగా కలవడమే కాకుండా నగ్న ఫొటోలు అందరికీ పంపుతానని బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రాలోని కోనసీమలో చోటు చేసుకుంది. ఈ కేసును తెలంగాణలోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఆ రాష్ట్ర పోలీసులు బదిలీ చేశారు.

మధురానగర్‌ పోలీసుల సమాచారం మేరకు.. ఆంధ్రాలోని కోనసీమ జిల్లా గండేపల్లి మండలం పి.వినాయకంపల్లి గ్రామానికి చెందిన జాషువా, ఓ మహిళ, కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన వి.నరసింహమూర్తి పబ్జి గేమ్‌ ద్వారా స్నేహితులయ్యారు. ఆ మహిళ ఇటీవల తన మేనమామ జాషువాను వివాహం చేసుకుంది. వారి వివాహం తర్వాత నరసింహమూర్తి ఆ మహిళను ప్రేమ పేరుతో సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ భర్త జాషువా ఆమెతో గొడవపడ్డాడు. దాంతో ఆమె ఉద్యోగం చేసుకుంటానని చెప్పి హైదరాబాద్‌లోని బల్కంపేటలో ఉండే తన స్నేహితురాలు నవ్యను కలిసింది.

ఇటీవల నవ్య ద్వారా ఆ మహిళ అడ్రస్‌ను తెలుసుకున్న నర్సింహమూర్తి హైదరాబాద్‌ వచ్చాడు. ఆమె గదిలోనే రెండు రోజులు గడిపాడు. అనంతరం తన స్నేహితురాలు మంచిది కాదని ఆమెను నమ్మించి అమీర్‌పేటలోని సిద్ధి వినాయక హాస్టల్‌కు తరలించి అక్కడే ఇద్దరూ ఉంటున్నారు. ఈ క్రమంలో నిందితుడు నీ భర్తకు విడాకులిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్‌’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..

జవహర్‌నగర్‌లోని తన మరో గదికి తీసుకెళ్లి కూల్‌ డ్రింక్‌లో మద్యం కలిపి ఆమె మత్తులో ఉన్నప్పుడు నగ్న ఫొటోలు తీశాడు. తనతో శారీరకంగా కలవకపోతే అందరికీ వాటిని పంపుతానని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆందోళన చెందిన ఆమె ఆంధ్రాకు వచ్చి నిందితుని స్వగ్రామమైన అంగర గ్రామ బస్టాప్‌ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఆమెను చుట్టుపక్కల వారు, బంధువులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ కేసును నిందితుడు ఉంటున్న హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)