Breaking News

నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Published on Tue, 10/10/2023 - 16:17

సాక్షి, విజయవాడ: నారాయణ అల్లుడు పునీత్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ నోటీస్‌ క్వాష్‌ చేయాలన్న పునీత్‌ పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది. న్యాయవాదితో కలిసి రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలని పునీత్‌ను హైకోర్టు ఆదేశించింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. కొత్త కోణాలు వెలుగులోకి 
టీడీపీ హయాంలో అమరావతి భూదోపిడీ పర్వంలో కీలకమైన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డే లేదు..! మాకేం తెలియదంటూ చంద్రబాబు, నారా­యణ, లోకేశ్‌ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్ర­మాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ గురించి తమకు ముందుగా ఏమాత్రం తెలియదన్న వారి వాదనలో నిజం లేదని తేలిపోయింది. రైతులు, ఇతరుల ప్రయోజ­నా­­లను దెబ్బ తీయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజె­క్టును కూడా అటకెక్కించినట్లు బహిర్గతమైంది.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ పక్కా ప్రణాళిక రచించారు. హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును నిర్మించేలా అలైన్‌మెంట్‌లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు.

అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము ముందస్తుగానే ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరచాలని షరతు విధించారు.  అప్పటికే తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించుకున్నారు. తద్వారా అటు అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలో ఇటు నదికి అవతల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా కుట్ర పన్నారు.
చదవండి: తోడు దొంగల ‘రింగ్‌’!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)