Breaking News

ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఎవిడెన్స్‌..

Published on Sun, 03/05/2023 - 16:04

సాక్షి, వరంగల్‌ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యమయింది. ఈ  కేసులో జూనియర్ మెడికో వాంగ్మూలం కీలకంగా మారనుంది. పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీలో కీలక విషయాలను బయట పెట్టిన జూనియర్ డాక్టర్.. ప్రీ అనస్థిషియా రిపోర్ట్ వివాదంలో డాక్టర్ సైఫ్ చెప్పిన అభిప్రాయానికి భిన్నమైన విషయాలను వెల్లడించారు.

పీఏసీ రిపోర్ట్ విషయంలో డాక్టర్ సైఫ్ ఫిజికల్‌గా లేకున్నా డాక్టర్ ప్రీతిని బ్లేమ్ చేసినట్టు నిర్ధారణ అయింది. జీఎంహెచ్‌లో జూనియర్ విద్యార్థినికి డిక్టేట్ చేస్తూ పీఏసీ రిపోర్ట్‌ని డాక్టర్ ప్రీతి ఫైండింగ్స్ పొందుపరిచినట్లు విచారణలో వెలుగు చూసింది. 

డాక్టర్ సైఫ్ తనను కావాలని వేధిస్తున్నాడని, పీఏసీ రిపోర్ట్ వివాదం వివరించి తనకు సపోర్ట్ చేయాలని అర్ధించిన డాక్టర్ ప్రీతి.. తనపై కుట్ర జరుగుతోందని మానసిక సంఘర్షణకు లోనైంది. ఇదే విషయం లాస్ట్ కాల్‌లో సహ విద్యార్థికి తన ఆవేదన వెలిబుచ్చింది.

డాక్టర్ ప్రీతి లాస్ట్ కాల్‌పై పూర్తి స్థాయి సమాచారాని విచారణ బృందం సేకరిస్తోంది. పీఏసీ రిపోర్ట్ విషయంలో నిందితుడు డాక్టర్ సైఫ్ వాదన అవాస్తవమని పోలీస్ విచారణ రుజువు చేస్తోంది. డాక్టర్ సైఫ్, డాక్టర్ ప్రీతి మధ్య వివాదంగా మారిన ప్రశ్నించే తత్వం, దానికి సంబంధించిన చాట్స్ లభ్యమైంది. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా కేసును పోలీసులు అధికారులు బిల్డప్ చేయనున్నారు.

సైఫ్ వేధింపులపై సాంకేతిక పరమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. నాలుగు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న సైఫ్ చెప్పిన వివరాలతో అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌ నిర్లక్ష్యం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి.

కౌన్సిలింగ్‌లో ప్రీతి కన్నీరు పెట్టడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జీఎంహెచ్‌లో సైఫ్, అనస్తిషియా డిపార్ట్‌మెంట్‌లో హెచ్‌వోడీ వ్యవహారం, ప్రీతి ఆడియోల్లో హెచ్‌వోడి పేరు ప్రస్తావించడాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. సైఫ్, హెచ్‌వోడి నాగార్జున రెడ్డి వ్యవహారాన్ని పోలీసులు ర్యాగింగ్ కోణంలో చూస్తున్నారు.

లీవ్, కౌన్సిలింగ్ విషయంలో నాగార్జున్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమయింది. ఇప్పటికే హెచ్‌వోడీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ రోజుతో సైఫ్  నాలుగు రోజుల పోలీసుల కస్టడీ ముగుస్తుంది. కాగా, రేపు(సోమవారం) కోర్టులో సైఫ్‌ను హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు.
చదవండి: కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది: సాత్విక్‌ పేరెంట్స్‌

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)