Breaking News

అమేథీ హత్యలు.. ఆమె వివాహేతర సంబంధమే కొంప ముంచింది!

Published on Sat, 10/05/2024 - 17:51

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమేథీలో కుటుంబమంతా తుపాకీ కాల్పుల్లో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలను ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. మృతులను టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ కుమార్‌, ఆయన భార్య పూనమ్ భారతి, ఆరేళ్లు-ఏడాది వయసున్న ఇద్దరు కూతుర్లుగా గుర్తించారు. ఈ ఘటన గురువారం వెలుగుచూడగా.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుడు చందన్‌ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి  విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

నిందితుడు విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించినట్లు అమేథీ ఎస్పీ అనూప్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ హత్యల వెనక వివాహేతర సంబంధమే కారణమని తేలిందన్నారు. నిందితుడికి, మహిళకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒకటిన్నర సంవత్సరంగా పూనమ్‌తో అక్రమంగా సంబంధం కలిగి ఉన్నాడని అయితే ఇటీవల ఇద్దరి మధ్య  రిలేషన్‌షిప్‌ దెబ్బతినడంతో అతడు ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. 

ఆ కారణంగానే ఆవేశంలో.. ఇంట్లోకి చొరబడి నలుగురిని కాల్చిచంపినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. అతడు ఒక్కడే ఈ ఘోరాలకు పాల్పడ్డాడని, ఘటనాస్థలంలో లభించిన బుల్లెట్లన్నీ ఒకే పిస్టల్‌ నుంచి రావడం వల్లే తాము ఆ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. 

కాగా సునీల్ కుమార్, అతని భార్య పూనమ్, వారి ఇద్దరు కుమార్తెలు గురువారం అమేథీలోని భవానీ నగర్‌లోని వారి ఇంటిలో కాల్పుల్లో హత్యకు గురయ్యారు. నిందితుడు చందన్‌ వర్మ తుపాకీతో 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. కుటుంబంలోని అందరినీ చంపిన తర్వాత తనను తాను కాల్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ మిస్ అయింది. మళ్లీ కాల్చుకునే ధైర్యం చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు. ఇక తీవ్రగాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఢిల్లీకి పారిపోతున్న నిందితుడిని నోయిడాలోని టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ పోలీస్‌ అధికారి తుపాకీని లాక్కొని తప్పించుకునే ప్రయత్నంలో అతను కాల్పుల్లో గాయపడ్డాడు. తాజాగా ఆ ఘటన సమయంలో వాడిన ద్విచక్ర వాహనం, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ హత్యల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం పూనమ్ పెట్టిన పోలీసు కేసు విషయం వెలుగులోకి వచ్చింది. వర్మ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె అందులో ఫిర్యాదు చేశారు. దీని గురించి ఫిర్యాదు చేస్తే.. చంపేస్తానని బెదిరించాడని, తమ కుటుంబానికి ఏదైనా హాని తలపెడితే అందుకు అతడే కారణమని పేర్కొంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)