Breaking News

యాక్సిడెంట్‌ను చూడబోతే.. 9 మంది మృతి

Published on Thu, 07/20/2023 - 12:33

గాంధీనగర్‌: గుజరాత్‌ అహ్మదాబాద్‌ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. సర్కేజ్‌-గాంధీనగర్‌ హైవేపై ఉన్న ఇస్కాన్‌ వంతెనపై జరిగిన డబుల్‌ యాక్సిడెంట్‌లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి దాటాక ఓ థార్‌ వాహనాన్ని ఓ డంపర్‌ ట్రక్కు వెనకాల నుంచి ఢీ కొట్టడంతో యాక్సిడెంట్‌ జరిగింది. ఆ సమయంలో జనం గుమిగూడి ఆ యాక్సిడెంట్‌ను చూస్తున్నారు. ఆ సమయంలో ఓ జాగ్వార్‌ కారు జనాల మీదకు దూసుకెళ్లింది.  

ISKCON bridge Accidentలో గాయపడ్డ వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తొమ్మది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ కానిస్టేబుల్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే.. జాగ్వార్ కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఘటనపై గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ. 50వేల సాయం రాష్ట్రప్రభుత్వం తరపున అందిస్తున్నట్లు ప్రకటించారు. 

కారులో ఉంది ప్రముఖుడైన ప్రజ్నేష్ పటేల్ కుమారుడని తాత్యా పటేల్‌ అని తెలుస్తోంది. ఘటన తర్వాత కొందరు ఆ యువకుడిని చితకబాదిన దృశ్యాలూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)