Breaking News

6 టన్నుల ఐరన్‌ బ్రిడ్జి అలా మాయమైంది!

Published on Sun, 07/09/2023 - 05:44

ముంబై: ముంబై శివారు మలాడ్‌(పశ్చిమ)లో 6 వేల కిలోల బరువైన ఇనుప వంతెనను మాయం చేసిన ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భారీ విద్యుత్‌ కేబుళ్లను అటూఇటూ జరిపేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ 90 అడుగుల పొడవైన ఇనుప వంతెనను ఏర్పాటు చేసింది. అక్కడే శాశ్వత వంతెనను నిర్మించడంతో ఇనుప బ్రిడ్జిని గత కొన్ని నెలల క్రితం మరో ప్రాంతంలోని మురుగు కాల్వపైకి తరలించారు. ఈ వంతెన కనిపించకుండా పోయిందంటూ అదానీ సంస్థ జూన్‌ 26న బంగుర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

జూన్‌ 6వ తేదీ నుంచే ఆ బ్రిడ్జి మాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్రాంతంలో సీసీటీ కెమెరాలు లేవు. సమీప ప్రాంతాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించగా జూన్‌ 11వ తేదీన వంతెన వైపుగా ఒక భారీ లారీ వచ్చిన విషయం రికార్డయింది. ఆ లారీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా కూపీ లాగారు. అందులోనే గ్యాస్‌ కటింగ్‌ యంత్రాలను తీసుకువచ్చి 6 టన్నుల ఇనుప వంతెనను కట్‌ చేసి ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. ఆ బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఉద్యోగే సూత్రధారి అని తేలడంతో అతడిని, సహకరించిన మరో ముగ్గురిని గత వారం అదుపులోకి తీసుకున్నారు. ఎత్తుకుపోయిన ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)