Breaking News

పట్టపగలు బైక్‌కు తాడుతో కట్టేసి.. యువకుడిని కిలోమీటర్‌ ఈడ్చుకెళ్లి..

Published on Fri, 07/28/2023 - 21:25

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో అమానుష ఘటన వెలుగుచూసింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని రోడ్డుపై విచక్షణారహితంగా లాక్కెళ్లారు. యువకుడిని తాళ్లతో కట్టేసి బైక్‌పై కిలోమీటర్‌ వరకు ఈడ్చుకెళ్లారు. జూలై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు యువకుడిని తాడుతో కట్టి లాక్కెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టపగలే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ దారుణం జరగడం మరింత విచారకరం. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. 

అయితే దుండగులు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదు. వీడియో వైరల్‌ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బరాదరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సంజయ్‌ నగర్‌లో ఘటన జరిగినట్లు గుర్తించారు. ఈ చర్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: ‘మహాభారతంలోనూ లవ్‌ జిహాద్‌’.. కాంగ్రెస్‌ చీఫ్‌ క్షమాపణలు

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)