Breaking News

దుర్గా పూజ మండపం వద్ద తొక్కిసలాట.. అయిదేళ్ల చిన్నారి స‌హా ముగ్గురి మృతి

Published on Tue, 10/24/2023 - 09:43

పాట్నా: బిహార్‌లో విషాదం నెల‌కొంది. ద‌స‌రా ఉత్స‌వాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా పూజ మండ‌పం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఓ చిన్నారి ఉన్నారు.  మ‌రో 10మందికి పైగా గాయ‌ప‌డ్డారు.  గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

వివ‌రాలు.. దేవి న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా రాజా ద‌ళ్ ప్రాంతంలో దుర్గా పూజ వేడుక‌లు నిర్వ‌హించారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.  ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడ‌టంతో మండ‌పం వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో అయిదేళ్ల బాలుడు, ఇద్ద‌రు మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు.

దీనిపై గోపాల్ గంజ్ ఎస్పీ స్వ‌ర్ణ ప్ర‌భాత్ మాట్లాడుతూ.. సోమ‌వారం రాత్రి 8.30 గంట‌ల‌కు రాజాద‌లళ్ పూజా పండ‌ల్ గేటు దగ్గ‌ర తొక్కిస‌లాట జ‌రిగింద‌ని తెలిపారు.  ఈ క్ర‌మంలో ఓ బాలుడు కిందపడి పోవ‌డంతో అత‌డిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించిన‌ ఇద్దరు మహిళలు సైతం కిందపడిపోయారన్నారు. అదే స‌మ‌యంలో భ‌క్తులు ప్ర‌సాదం కోసం బారులు తీర‌డంతో  తొక్కిస‌లాట జ‌రిగింద‌ని చెప్పారు. 

దీంతో ముగ్గురికి ఊపిరాడ‌క అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లార‌ని,, ఆసుప‌త్రికి త‌ర‌లించేలోపు  ముగ్గురు మ‌ర‌ణించార‌ని పేర్కొన్నారు. వెంట‌నే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించిన‌ట్లు చెప్పారు. మ‌రో 10కి పైగా గాయ‌ప‌డ‌గా.. వారిని స‌ద‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. అయితే భ‌క్తుల ర‌ద్దీని నియంత్రించేందుకు మండ‌పం వ‌ద్ద ఎలాంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేపట్ట‌క‌పోవ‌డ‌మే తొక్కిస‌లాట‌కు దారితీసింద‌ని పోలీసులు తెలిపారు.
చ‌ద‌వండి: త‌మిళ‌నాడులో రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురి మృతి

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)