రంగులు వేయకండని బ్రతిమాలాడు.. అయినా చంపేశారు..!

Published on Thu, 03/13/2025 - 20:55

జైపూర్: రాజస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది.  25 ఏళ్ల యువకుడ్ని కొట్టి చంపేశారు  రాల్వాస్ గ్రామంలో ముగ్గురు యువకులు. హోలీ పండుగ పేరుతో  హన్స్ రాజ్ అనే యువకుడిపై రంగులు చల్లేందుకు ముగ్గురు యువకులు వచ్చారు.  లైబ్రరీలో బుక్స్ చదువుకుంటున్న తరుణంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.

వారు రంగులు చల్లే క్రమంలో హన్స్ రాజ్ వద్దని వారించాడు. తనపై చల్లవద్దని, ప్రస్తుతం కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని విన్నవించాడు.  అయితే రంగులు చల్లించుకోవడానికి నిరాకరిస్తావా అంటూ హన్స్ రాజ్ ను చావబాదారు సదరు యువకులు.  బెల్ట్ లతో, స్టిక్స్ తో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేకపోయిన హన్స్ రాజ్.. ప్రాణాలు కోల్పోయాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని అశోక్, బబ్లూ, కలుకరణ్ గా గుర్తించారు.  వీరిని వెంటనే అరెస్టు చేసినట్లు అడిషనల్ ఏఎస్సీ దినేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు.

నేషనల్‌ హైవే దిగ్బంధనం.. పెద్ద ఎత్తున ఆందోళన
ఈ అమానుష ఘటనపై హన్స్ రాజ్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హన్స్ రాజ్ భౌతిక కాయాన్ని తీసుకుని నేషనల్ హైవేను బ్లాక్ చేశారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వారు  ఆందోళన విరమించారు. హన్స్ రాజ్ కుటుంబానికి రూ. 50 లక్షల తక్షణ పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసుల నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని నేషనల్ తొలగించి, ఆందోళన విరమించారు రాల్సాస్ గ్రామస్థులు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)