Breaking News

ఎంత విషాదం.. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిన యువకుడు

Published on Thu, 07/20/2023 - 14:43

న్యూఢిల్లీ: యువతలో ఆకస్మిక మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్‌ఎటాక్‌లు.. కారణాలేవైనా నూరేళ్ల జీవితం అనుభవించాల్సిన యంగ్‌స్టర్స్‌.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అర్ధాంతరంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు.

నగరంలోని రోహిని ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీటెక్‌ పూర్తి చేసిన 24 ఏళ్ల యువకుడు సాక్షం పృథి.. గురుగ్రామ్‌కు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సెక్టార్‌ 19లో నివాసముంటున్నాడు. ఇతడు స్థానికంగా సెక్టార్‌ 15లో ఉన్న జిమ్‌ప్లెక్స్‌ ఫిట్‌నెస్‌ జోన్‌లో తరుచుగా వ్యాయామానికి వెళ్తుంటాడు. ఇదే క్రమంలో గత మంగళవారం జిమ్‌కు వెళ్లాడు. 

ఉదయం 7.30 సమయంలో ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటివారు, సిబ్బంది.. యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విద్యుదాఘాతమే బాధుతుడి మృతికి కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జిమ్‌ మేనేజర్‌ అనుభవ్‌ దుగ్గల్‌ను అరెస్ట్‌ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
చదవండి: యాక్సిడెంట్‌ను చూడబోతే.. 9 మంది మృతి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)