Breaking News

Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ

Published on Fri, 12/13/2024 - 09:04

కవాడిగూడ: దొంగలు బరితెగించారు. దోమలగూడ పరిధిలోని అరవింద్‌నగర్‌ కాలనీలో గురువారం తెల్లవారుజామున నగల వ్యాపారిని మారణాయుధాలతో బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కోల్‌కతాకు చెందిన రంజిత్‌ గౌరాయ్‌ కొన్నేళ్లుగా అరవింద్‌నగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. 

నగరంలోని వివిధ జ్యువెలరీ  షాపుల నుంచి ఆర్డర్లు తీసుకుని నగలు తయారు చేసి సప్లయ్‌ చేస్తుంటారు. రంజిత్‌ వద్ద దాదాపు సుమారు 50 మంది కారి్మకులు పని చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3– 4 గంటల మధ్య దాదాపు ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రంజిత్‌ ఇంటి తలుపులు కొట్టి కత్తులతో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. రంజిత్‌ కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

 దీంతో బాధితుడు రంజిత్‌ గౌరాయ్‌ దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  వారు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్‌లతో తనిఖీలు చేపట్టారు. బంగారం దోపిడీకి పాల్పడింది ఇంట్లో పని చేస్తున్న సిబ్బందికి తెలిసినవారా? గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.  

హైదరాబాద్‌లో దారుణం


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)