Breaking News

కోటాలో రాలిన మరో విద్యా కుసుమం.. ముఖానికి ప్లాస్టిక్‌ బ్యాగ్‌ చుట్టుకొని..

Published on Fri, 08/04/2023 - 04:58

కోటా(రాజస్తాన్‌):  రాజస్తాన్‌లోని కోటా పట్టణంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్‌ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ముఖానికి ప్లాస్టిక్‌ బ్యాగ్‌ చుట్టుకొని ఊపిరాడని స్థితిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన మన్‌జోత్‌ చాబ్రా కోటాలోని ఓ శిక్షణా కేంద్రంలో ‘నీట్‌’ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం తన హాస్టల్‌ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. మన్‌జోత్‌కు అతని తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయకపోవడంతో వారు హాస్టల్‌ వార్డెన్‌ను అప్రమత్తం చేశారు.

విద్యార్థి గది తలుపులను బద్దలు కొట్టి చూడగా మృతదేహం కనిపించింది. కోటాలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో హాస్టల్‌ గదుల్లో సీలింగ్‌ ఫ్యాన్‌కి యాంటీ సూసైడ్‌ పరికరాలు అమర్చారు. దీంతో మన్‌జోత్‌ తన ముఖానికి, తలకి ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్‌ని చుట్టుకొని, దానికి ఒక బట్టను గట్టిగా కట్టి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు అధికారి ధర్మవీర్‌ సింగ్‌ వెల్లడించారు. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ అతడి గదిలో ఒక లేఖ లభ్యమైనట్లు చెప్పారు.

మన్‌జోత్‌ చాలా తెలివైనవాడని, అందరితో జోక్స్‌ వేస్తూ సరదాగా ఉంటాడని అతని స్నేహితులు చెప్పారు.  కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 19కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు కోచింగ్‌ కోసం వస్తుంటారు. చదువుల్లో ఒత్తిడి  వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)