Breaking News

Israel Hamas war: యాపిల్‌ వాచ్‌ ద్వారా కూతురి మృతదేహాన్ని గుర్తించిన తండ్రి..!

Published on Thu, 10/19/2023 - 14:58

ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం కారణంగా మరణించిన  ఓ యువతి మృతదేహాన్ని ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌ ద్వారా  గుర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో  తెలుసుకుందాం.

ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు అకస్మికంగా దాడిచేశారు. ఒకవైపు రాకెట్లుతో, మరోవైపు తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో మెల్లనాక్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్‌ వాల్డ్‌మాన్‌ కుమార్తె డేనియల్‌ మరణించారు.  స్నేహితుడితో కలిసి ఇజ్రాయెల్‌లోని ఓ మ్యూజిక్‌ ప్రోగ్రాంకు వెళ్లిన డేనియల్‌ హమాస్‌ దాడిలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనంతరం డేనియల్‌ ఫోన్‌ నుంచి వాల్డమన్‌ ఫోన్‌కు అత్యవసర కాల్‌ వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు.

అయితే కుమార్తెను హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అనంతరం కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌ ద్వారా లోకేషన్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు డేనియల్‌ ఆపిల్‌ వాచ్‌ నుంచి సిగ్నల్‌ వచ్చింది. సిగ్నల్‌ అందిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. కుమార్తె మృతదేహం కనిపించింది. ఆమెతోపాటు వెళ్లిన డేనియల్‌ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించింది. వారిద్దరికి త్వరలో పెళ్లి చేయాలని భావించినట్లు వాల్డమన్‌ తెలిపారు. అంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

డేనియల్‌ ఐఫోన్‌లో క్రాష్‌ డిటెక్షన్‌ కాల్‌ టెక్నాలజీ ఉందని, అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే తనకు అత్యవసర కాల్‌ వచ్చినట్లు వాల్డమన్‌ వెల్లడించారు. ఆ కాల్‌ రావడంతోనే తమ కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిపారు. (బైక్‌పై జొమాటో డెలివరీ గర్ల్‌ రైడింగ్‌..సీఈవో ఏమన్నారంటే!)

యాపిల్‌ ఐఫోన్‌, వాచ్‌లో ఉన్న క్రాష్‌ డిటెక్షన్‌ కాల్ ఫీచర్‌ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అందించిన ఫోన్‌ నంబర్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఆ ప్రాంతం లోకేషన్‌ను కూడా షేర్‌ చేస్తుంది. ఫలితంగా తమ ఆత్మీయులను త్వరగా కాపాడుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)