Breaking News

ఏఐ వినియోగంలో భారత్‌ జోరు

Published on Wed, 02/11/2026 - 08:37

దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్‌ప్రైజ్‌ విభాగంలో ఏఐ/ఎంఎల్‌ (మెషిన్‌ లెర్నిగ్‌) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్‌ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్‌ పేర్కొంది. ఏజెంటిక్‌ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్‌ మధ్య జీస్కేలర్‌ జీరో ట్రస్ట్‌ ఎక్సే్చంజ్‌ ప్లాట్‌ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్‌ లెరి్నంగ్‌ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్‌ ఈ రిపోర్టును రూపొందించింది. 

ఫిబ్రవరి 16–20 మధ్య భారత్‌లో ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్, ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఆంథ్రోపిక్‌ సీఈవో డేరియో, క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో ఎమోన్‌ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు.  

నివేదిక ప్రకారం..

  • దేశీ కంపెనీలు 2025 జూన్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్‌ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్‌ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.

  • డిజిటల్‌ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు  ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్‌–ఫస్ట్‌ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్‌ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి.  

  • దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్‌ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్‌–ఇన్సూరెన్స్‌ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి.  

  • కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్‌ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్‌ డిమాండ్‌కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం.  

  • ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్‌లను సూచిస్తోంది.

  • స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్‌ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు.  

  • సైబర్‌క్రిమినల్స్, నిఘా గ్రూప్‌లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్‌ వేగంతో, భారీ స్థాయిలో సైబర్‌ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది.  

  • డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్‌లోకి 18,000 టెరాబైట్స్‌ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్‌ ఫొటోలకు సమానం. ఏజెంటిక్‌ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది.  

  • ఈ రిస్క్‌లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు  ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్‌ జీరో ట్రస్ట్‌ వ్యవస్థను వినియోగించుకోవాలి.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)